భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌పై ఆస్ట్రేలియా కన్నేసింది. ఈ మెగా టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి ఆరోసారి టైటిల్‌ను ముద్దాడాలని ఆసీస్ భావిస్తోంది. ఈ మెగా ఈవెంట్ కోసం అందరికంటే ఆస్ట్రేలియానే తమ జట్టును ప్రకటించింది. ఈ టోర్నీ కోసం కంగారూలు తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటారు. ఇందులో భాగంగానే వరల్డ్‌కప్‌కు ముందు ఆతిథ్య భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కమ్మిన్స్ సైన్యం తలపడనుంది.
వరల్డ్‌కప్‌కు జెర్సీ విడుదల చేసిన ఆసీస్..
ఈ మెగా ఈవెంట్‌కు ధరించబోయే తమ నూతన జెర్సీని క్రికెట్ ఆస్ట్రేలియా ఆవిష్కరించింది. యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో కాస్త కొత్తగా కనిపిస్తున్న జెర్సీపై ఎడమవైపు వన్డే ప్రపంచకప్ 2023 అని రాసి ఉండగా.. మధ్యలో ఆస్ట్రేలియా అని ఇంగ్లీష్‌లో .. కుడివైపు ఆస్ట్రేలియా చిహ్నం ఉంది.
కాగా ఆస్ట్రేలియా జెర్సీ స్పాన్సర్‌గా ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉంది. ఇందుకు సంబంధిచిన ఫోటోలను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్(ఎక్స్)లో షేర్ చేసింది. ఇక ఇప్పటికే ఈ టోర్నీ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు తమ జెర్సీలను విడుదల చేశాయి. వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న భారత్‌తో తలపడనుంది.
చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే?
Here it is! Our 2023 Men’s World Cup kit ready for action in India 🔥 #CWC23 #KitWeek pic.twitter.com/uOLgPAYvT5
— Cricket Australia (@CricketAus) September 22, 2023
Comments
Please login to add a commentAdd a comment