ఐపీఎల్‌లో అక్షర్‌ పటేల్‌ అరుదైన రికార్డు.. రెండో ఆటగాడిగా..! | Axar Patel completes 100 IPL wickets, joins Ravindra Jadeja | Sakshi
Sakshi News home page

IPL 2022: ఐపీఎల్‌లో అక్షర్‌ పటేల్‌ అరుదైన రికార్డు.. రెండో ఆటగాడిగా..!

Published Tue, May 17 2022 10:44 AM | Last Updated on Tue, May 17 2022 12:19 PM

Axar Patel completes 100 IPL wickets, joins Ravindra Jadeja - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన రెండో లెప్ట్మ్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా అక్షర్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనతను అక్షర్‌ సాధించాడు. అంతకు ముందు జడేజా ఈ రికార్డును నమోదు చేశాడు. అదే విధంగా ఐపీఎల్‌లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అక్షర్‌ పటేల్‌ చేరాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా అక్షర్‌ నిలిచాడు.

అంతకు ముందు రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, సునీల్‌ నరైన్‌ ఈ ఘనత సాధించారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్ష్ (63) పరుగులతో రాణించాడు. ఇక పంజాబ్‌ బౌలర్లలో అర్ష్దీప్‌ సింగ్, లివింగ్‌స్టోన్‌ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. జితేశ్‌ శర్మ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు.

చదవండిIPL 2022: ముంబై ఇండియన్స్‌లోకి యువ ఆటగాడు.. ఎవరీ ఆకాష్ మధ్వల్‌..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement