బాబర్ అజమ్
మాంచెస్టర్: ఇంగ్లండ్ టూర్‌ను పాకిస్తాన్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. బుధవారం మొదలైన తొలి టెస్టులో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్, షాన్ మసూద్ ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో ఆటను ముందుగానే నిలిపేయడంతో తొలిరోజు కనీసం 50 ఓవర్లయినా సాగలేదు.
బాబర్ (100 బంతుల్లో 69 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో నిలిచాడు. ఓపెనర్ షాన్ మసూద్ (152 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు) రాణించడంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఇబ్బందులు తప్పలేదు. అబిద్ అలీ (16)ని ఆర్చర్ క్లీన్‌బౌల్డ్ చేయగా... కెప్టెన్ అజార్ అలీ (0)ని వోక్స్ డకౌట్‌గా పంపాడు. దీంతో మసూద్, బాబర్ జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: షాన్ మసూద్ బ్యాటింగ్ 46; అబిద్ అలీ (బి) ఆర్చర్ 16; అజార్ అలీ ఎల్బీడబ్ల్యూ (బి) వోక్స్ 0; బాబర్ బ్యాటింగ్ 69; ఎక్స్‌ట్రాలు 69; మొత్తం (49 ఓవర్లలో 2 వికెట్లకు) 139/2.
వికెట్ల పతనం: 1–36, 2–43.
బౌలింగ్: అండర్సన్ 8–2–32–0; బ్రాడ్ 11–4–24–0, వోక్స్ 8–2–14–1, ఆర్చర్ 10–3–23–1, బెస్ 9–1–30–0, రూట్ 3–0–9–0.
Comments
Please login to add a commentAdd a comment