బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల జట్టుకు పరాభవం ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. 2-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. ఇవాళ (జులై 16) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
వరుణుడి కారణంగా 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 35.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు బంతితో రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ చేసిన 20 పరుగులే అత్యధికం. స్మృతి మంధన (11) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (5), యస్తిక భాటియా (15), జెమీమా రోడ్రిగెస్ (10), చేతులెత్తేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. భారత బౌలర్లు అమన్‌జోత్ కౌర్ (4/31), దేవిక వైద్య (2/36), దీప్తి శర్మ (1/26) ధాటికి తక్కువ స్కోర్‌కు ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నిగార్ సుల్తానా (39) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఫర్జానా హక్ (27), ముర్షిదా ఖాతూన్ (13), రబియా ఖాన్ (10), ఫాతిమా ఖాతూన్ (12 నాటౌట్), సుల్తానా ఖాతూన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జులై 19న ఢాకా వేదికగా జరుగనుంది.
భారత్‌పై తొలి గెలుపు..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న బంగ్లాదేశ్.. వన్డేల్లో టీమిండియాపై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు వన్డే ఫార్మాట్‌లో బంగ్లాదేశ్.. భారత్‌పై ఒక్క విజయం కూడా సాధించింది లేదు. తాజా గెలుపుతో బంగ్లా ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment