ఆసియాకప్-2023 కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్దమవుతున్నాడు. కోహ్లి ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో తీవ్రంగా శమ్రిస్తున్నాడు. అలూరులో నిర్వహించిన యో-యో టెస్టును కూడా విరాట్ క్లియర్ చేశాడు. ఈ క్రమంలో యో-యో టెస్టులో పాసయ్యానని, 17.2 స్కోర్ సాధించినట్లు సోషల్ మీడియా వేదికగా కోహ్లి వెల్లడించాడు.
బీసీసీఐ సీరియస్..
అయితే ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోహ్లికి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కోహ్లి యో-యో టెస్టుకు సంబంధించిన స్కోర్‌ను పోస్ట్ చేయడం బీసీసీఐ అపెక్స్ బాడీ ఉన్నతాధికారులకు ఏ మాత్రం నచ్చలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోసారి ఇలా అలా చేయొద్దంటూ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
"జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ఆటగాళ్లను హెచ్చరించాం. వారు తమ ట్రైనింగ్ సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. కానీ వారి స్కోర్‌లను, అంతర్గత విషయాలను బహిర్గతం చేయకూడదు. అది వారి కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్దమని" బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు.
చదవండి: Asia Cup 2023: యో- యో టెస్టులో పాసైన రోహిత్, హార్దిక్.. మరి రాహుల్ సంగతి?
Comments
Please login to add a commentAdd a comment