టీమిండియా స్టార్ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్-2023కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేకేఆర్ మెనెజ్‌మెంట్ అయ్యర్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో పడింది.
కాగా అయ్యర్ స్థానంలో బెంగాల్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామిని తీసుకోవాలని కేకేఆర్ మెనెజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో కేకేఆర్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ సుదీప్ కుమార్‌ను రప్పించి ట్రయల్స్ నిర్వహించింది.
ఈ యువ ఆటగాడు నెట్స్‌లో రస్సెల్, డేవిడ్ వైస్ వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా అయ్యర్ రిప్లేస్‌మెంట్‌ను ఏప్రిల్ 13న ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక దేశీవాళీ క్రికెట్‌లో సుదీప్ కుమార్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 2019-20 తన డెబ్యూ రంజీ సీజన్‌లో 24 ఏళ్ల సుదీప్ అదరగొట్టాడు.
అదే విధంగా గత రంజీ సీజన్‌లో కూడా సుదీప్ అద్భుతంగా రాణించాడు. 2022-23 రంజీ సీజన్‌లో సుదీప్ 803 పరుగులు సాధించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా అతడు నిలిచాడు. అదే విధంగా విజయ్ హజారే ట్రోఫీ-2022లో కూడా సుదీప్ దుమ్మురేపాడు. ఈ టోర్నీలో అతడు 74.20 స్ట్రైక్ రేట్‌తో 371 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment