
విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ
Virat Kohli- Sourav Ganguly- Rohit Sharma: ‘‘రోహిత్‌ను కెప్టెన్ చేసి అతడికి ఏదో మేలు చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మేము విరాట్ కోహ్లికి వ్యతిరేకంగా ఉన్నామంతే. ఆ సమయంలో విరాట్ ఫామ్‌లేమిని బీసీసీఐ తనకు అనుకూలంగా మార్చుకుంది. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించింది. భారత నంబర్ 1 బ్యాటర్ పట్ల అలా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు’’ అని టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అన్నాడు.
కాగా ఓ టీవీ చానెల్.. స్టింగ్ ఆపరేషన్ ద్వారా భారత క్రికెట్ గురించి చేతన్ శర్మ పంచుకున్న అభిప్రాయాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పైచేయి సాధించాలనుకున్నాడు
ఆట కంటే తానే అత్యున్నతం భావించిన కోహ్లికి చేదు అనుభవం తప్పలేదన్న చేతన్ శర్మ.. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో కోహ్లి ఢీకొట్టడం అతడికి ప్రతికూలంగా మారిందన్నాడు. ‘‘టీ20 కెప్టెన్సీ వదిలేస్తానని కోహ్లి చెప్పినపుడు బీసీసీఐ, సెలక్షన్ కమిటీ అతడిని పునరాలోచించుకోవాలని సూచించింది.
కానీ, సౌతాఫ్రికా టూర్ ముందు తను మీడియా ముందుకు వచ్చి టీ20 కెప్టెన్సీ విషయాన్ని పెద్దది చేశాడు. బీసీసీఐ ప్రెసిడెంట్‌పై పైచేయి సాధించాలని చూశాడు’’ అని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు.
చేతన్ శర్మ
గొడవల్లేవు
ఇక కోహ్లి- రోహిత్‌ల మధ్య విభేదాల ప్రస్తావన వచ్చినపుడు.. ‘‘నిజానికి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అయితే, ఇద్దరిలో ఇగో మాత్రం ఉంది. వాళ్లిద్దరూ అమితాబ్ బచ్చన్- ధర్మేంద్రలా పెద్ద సినీ స్టార్లు అనుకోండి. వృత్తిగతంగానే కానీ వ్యక్తిగతంగా వారి మధ్య అంతగా గొడవలేమీ లేవు’’ అని చేతన్ శర్మ పేర్కొన్నాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వయంగా వైదొలగగా.. వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. దీంతో ప్రెస్‌మీట్ పెట్టిన కోహ్లి.. తనను సంప్రదించిన తర్వాతే వన్డే కెప్టెన్‌ను మార్చామన్న గంగూలీ వ్యాఖ్యలు ఖండించాడు. దీంతో బోర్డు- కోహ్లి మధ్య నాడు విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇక సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోగా.. రోహిత్ శర్మ అన్నిఫార్మాట్లకు సారథిగా నియమితుడతయ్యాడు.
చదవండి: WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్, వేదికలు.. ఫైనల్ అప్పుడే!
Ind Vs Aus 2nd Test: ఆసీస్‌తో రెండో టెస్టు ప్రత్యేకం.. ప్రధాని మోదీని కలిసిన పుజారా
Comments
Please login to add a commentAdd a comment