
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ట్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని సాహా భారీ షాట్‌కు యత్నించగా.. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది.
అయితే క్యాచ్ అందుకోవడం కోసం అటు శాంసన్.. ఇటు హెట్‌మైర్.. మధ్యలో జురెల్ దూసుకొచ్చాడు. ఒకరితో ఒకరు సమన్వయం లేకుండా పరిగెత్తుకొచ్చి చివరికి ఎవరు క్యాచ్ తీసుకోలేదు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ముగ్గురు చేతుల్లో నుంచి మిస్సైన బంతిని మళ్లీ బౌల్డ్ సురక్షితంగా అందుకున్నాడు.
దీంతో ఎటు తిరిగి సాహా అయితే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే హెట్‌మైర్, శాంసన్, జురేల్ చర్య మాత్రం నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Caught 𝚂̶𝚊̶𝚖̶𝚜̶𝚘̶𝚗̶, 𝙷̶𝚎̶𝚝̶𝚝̶𝚒̶𝚎̶, 𝙹̶𝚞̶𝚛̶𝚎̶𝚕̶ & Boult⚡ #GTvRR #TATAIPL #IPL2023 #IPLonJioCinema #TrentBoult | @rajasthanroyals pic.twitter.com/omaWl0QeLo
— JioCinema (@JioCinema) April 16, 2023
చదవండి: సాయపడడంలోనూ మనోడు ముందువరుసలోనే!