
ఢిల్లీ : టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ మంగళవారం ఒక ఇంటివాడయ్యాడు. కొరియోగ్రాఫర్ కమ్ యూట్యూబ్ స్టార్ ధనశ్రీ వర్మతో చహల్ కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. పెళ్లి ఫొటోలను చహల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్రికెట్ లైఫ్‌లో బిజీగా ఉన్న యువ స్పిన్నర్ వివాహ బంధంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. కాగా యంగ్ క్రికెటర్‌కు టీమిండియా సహచరులతో పాటు పలువురు సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు. (చదవండి : రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్)
ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 లో రవీంద్ర జడేజా గాయపడడంతో కాంకషన్‌గా వచ్చి జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే చహల్ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావడం పట్ల ఆసీస్ జట్టు అభ్యంతరం వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీసింది. కాగా 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన చహల్ టీమిండియా తరపున 54 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. (చదవండి : 'పేడ మొహాలు,చెత్త గేమ్‌ప్లే అంటూ..')