
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు చెన్నైసూపర్ కింగ్స్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్లు శివమ్ దుబే, డార్లీ మిచెల్ గాయాలతో సతమతమవుతుండగా.. తాజాగా మరో కివీస్ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి టీ20 సందర్భంగా రవీంద్ర ఎడమ కాలికి గాయమైంది.
దీంతో అతడు రెండో టీ20కు దూరమయ్యాడు. అయితే రెండో టీ20లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే సైతం గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్‌కు తరలించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడు మూడో టీ20కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో టిమ్ సీఫర్ట్ జట్టులోకి వచ్చాడు.
అయితే ఐపీఎల్ ఆరంభ సమయానికి కాన్వే పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు డార్లీ మిచెల్, రవీంద్ర కూడా పూర్తిగా కోలుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లో పేర్కొంటున్నాయి. కాగా ఈ ఏడాది ధానాదన్ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా సీఎస్‌కే, ఆర్సీబీ అమీతుమీ తెల్చుకోనున్నాయి.
చదవండి: IND vs ENG: తండ్రి వద్దన్నా... తనయుడు వినలేదు! అరంగేట్రంలోనే అదుర్స్
Comments
Please login to add a commentAdd a comment