పూణే వేదికగా ఇవాళ (అక్టోబర్ 19) భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్‌గా నజ్ముల్ హసన్ షాంటో వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా షకీబ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో నజ్ముల్ బంగ్లా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ రెండు మార్పులు చేసింది. షకీబ్ స్థానంలో నసుమ్, తస్కిన్ స్థానంలో హసన్ జట్టులో వచ్చారు. మరోవైపు భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.
తుది జట్లు..
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్: తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), నసుమ్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), తౌహిద్ హృదొయ్, మెహది హసన్, హసన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment