(ఫైల్ ఫోటో)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐసీసీ ఈవెంట్లలో బంగ్లాదేశ్‌పై ఘనమైన రికార్డు ఉంది. హిట్‌మ్యాన్.. ఐసీసీ టోర్నీల్లో బంగ్లాదేశ్‌తో తలపడిన గత మూడు సందర్భాల్లో సెంచరీలు చేశాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో 126 బంతుల్లో 137 పరుగులు చేసిన రోహిత్.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో 129 బంతుల్లో శతక్కొట్టాడు (123 నాటౌట్). అనంతరం 2019లో హిట్‌మ్యాన్ మరోసారి బంగ్లాదేశ్‌పై విరుచుకుపడ్డాడు. ఈ మెగా టోర్నీలో అతను కేవలం 92 బంతుల్లోనే శతకం (104) బాది, బంగ్లాదేశ్‌పై ఐసీసీ టోర్నీల్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో టీమిండియా ఇవాళ (అక్టోబర్ 19) బంగ్లాదేశ్‌తో తలపడుతున్న నేపథ్యంలో రోహిత్‌కు సంబంధించిన ఈ ఆసక్తికర రికార్డు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం హిట్‌మ్యాన్ ఉన్న ఫామ్‌లో బంగ్లాదేశ్‌పై వరుసగా నాలుగో సెంచరీ కూడానమోదు చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు. మరి పూణే వేదకగా బంగ్లాదేశ్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఎన్ని పరుగులు సాధిస్తాడో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.
కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రోహిత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సెంచరీ, ఓ అర్ధసెంచరీ చేసి భీకరఫామ్‌లో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఇదే ఊపును కొనసాగించి, ఇవాళ మరో సెంచరీ చేయాలని టీమిండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రోహిత్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 72.33 సగటున సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 217 పరుగులు చేసి, టోర్నీ లిడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
మరోవైపు ప్రస్తుత టోర్నీలో టీమిండియా సైతం వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఖంగుతినిపించిన భారత్.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లపై వరుస విజయాలు సాధించి, హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ జరిగే మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
చదవండి: CWC 2023: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. మరో రికార్డుపై కన్నేసిన కోహ్లి
‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’
Comments
Please login to add a commentAdd a comment