
బాకు (అజర్‌బైజాన్): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డెన్మార్క్ జట్టు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. చెక్ రిపబ్లిక్‌తో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ 2–1తో గెలిచింది. చివరిసారి డెన్మార్క్ 1992లో సెమీఫైనల్ చేరుకోవడమే కాకుండా ఏకైకసారి టైటిల్ కూడా సాధించింది. డెన్మార్క్ తరఫున డెలానీ (5వ ని.లో), డాల్‌బెర్గ్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. చెక్ రిపబ్లిక్ తరఫున షిక్ (49వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మరో క్వార్టర ఫైనల్లో ఇటలీ 2–1తో బెల్జియంను ఓడించి సెమీఫైనల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment