
పీఎల్-2024కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కోచింగ్ స్టాప్‌ను ప్రక్షాళన చేసేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో హెడ్‌కోచ్ సంజయ్ బంగర్, క్రికెట్ డైరక్టర్ మైక్ హెస్సన్‌కు ఆర్సీబీ ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ను నియమించింది.
ఈ మెరకు ట్విటర్‌లో ఆర్సీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే మైక్ హెస్సన్ స్ధానాన్ని మాత్రం ఆర్సీబీ ఇంకా ఎవరితో భర్తీ చేయలేదు. అదే విధంగా బ్యాటింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్‌పై కూడా వేటు వేయాలని ఆర్సీబీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్సీబీ మెంటార్‌గా ఏబీ డివిలియర్స్..
ఇక ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీడీ డివిలియర్స్ మళ్లీ ఆర్సీబీతో జతకట్టనున్నట్లు సమాచారం. అయితే ఆటగాడిగా కాకుండా జట్టు సపోర్టింగ్ స్టాప్‌లో ఏబీడీ భాగం కానున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది సీజన్‌లో తమ జట్టు మెంటార్‌గా డివిలియర్స్‌ను నియమించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటికే ఏబీడీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
డివిలియర్స్ కూడా ఆర్సీబీ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా చాలా సీజన్ల పాటు ఆర్సీబీకి డివిలియర్స్ ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ.. 39.71 సగటు, 151 స్ట్రైక్‌రేట్‌తో 5162 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో ౩ సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. తొలి భారత ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment