బర్మింగ్ హామ్: ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య తొలి ‘యాషెస్’ టెస్టు మ్యాచ్ వర్షం బారిన పడింది. వాన కారణంగా మూడో రోజు కేవలం 32.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆదివారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. డకెట్ (19), క్రాలీ (7) ఒకే స్కోరు వద్ద పెవిలియన్ చేరగా...ప్రస్తుతం పోప్ (0), రూట్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 311/5తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 7 పరుగుల అతి స్వల్ప ఆధిక్యం లభించింది. ఉస్మాన్ ఖ్వాజా (321 బంతుల్లో 141; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) తన స్కోరుకు మరో 15 పరుగులు జోడించగా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (38; 3 సిక్స్‌లు) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ మూడు వికెట్ల చొప్పున తీశారు.
చదవండి: రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం: స్మిత్
Comments
Please login to add a commentAdd a comment