క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. వరల్డ్‌కప్‌ టికెట్ల బుకింగ్‌ ఎప్పటినుంచి అంటే? | Exclusive: ICC Mens Cricket World Cup Ticket 2023 Tickets Sales Starting Date Announced, Know In Details - Sakshi
Sakshi News home page

ODI WC 2023 Tickets Sale Date: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. వరల్డ్‌కప్‌ టికెట్ల బుకింగ్‌ ఎప్పటినుంచి అంటే?

Published Thu, Aug 24 2023 9:09 AM | Last Updated on Thu, Aug 24 2023 10:21 AM

exclusive World Cup ticket sales starts Thursday - Sakshi

భారత్‌ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు రంగం సిద్దమైంది.  ప్రధాన పోరుకు ముందు సన్నాహకంగా జరిగే వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లూ సెప్టెంబర్‌ 29 నుంచి  అక్టోబర్‌ 3 మధ్య రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. ఈ మ్యాచ్‌లు హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి నగరాల్లో జరగనున్నాయి. భారత్‌ తమ  తొలి వార్మాప్‌ మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 30న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో గువహటి వేదికగా తలపడనుంది.

మాస్టర్‌ కార్డ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 
ఇక వరల్డ్‌ కప్‌ కోసం ‘బుక్‌ మై షో’ను తమ టికెటింగ్‌ భాగస్వామిగా బీసీసీఐ ప్రకటించింది. ప్రధాన మ్యాచ్‌లు, వామప్‌ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను బుక్‌ మై షో ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్‌ మినహా ఇతర జట్ల వామప్‌ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లుఈ నెల 25 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

అయితే బోర్డు స్పాన్సర్లలో ఒకరైన ‘మాస్టర్‌ కార్డ్‌’ వినియోగదారులకు మాత్రం ఒకరోజు ముందుగానే (నేటి సాయంత్రం 6 గంటల నుంచి, 29 సాయంత్రం 6 గంటల నుంచి) టికెట్లు లభిస్తాయి. భారత్‌ ఆడే వామప్‌ మ్యాచ్‌లకు ఈ నెల 30 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.  అదే విధంగా టీమిండియా ఆడే ప్రధాన టోర్నీ మ్యాచ్‌లకు నాలుగు ధపాలుగా టికెట్లు విడుదల చేయనున్నారు.

చెన్నై, ఢిల్లీ, పుణేలో భారత్‌ ఆడే మ్యాచ్‌లకు ఆగస్టు 31 నుంచి.. ధర్మశాల, లక్నో, ముంబైలో ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్‌ 1 నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా బెంగళూరు, కోల్‌కతాలో ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్‌ 2 నుంచి టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. మరోవైపు సెమీఫైనల్, ఫైనల్‌కు సెప్టెంబర్‌ 15న బీసీసీఐ విడుదల చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement