FIH Pro League: Sukhjeet Singh brace helps India beat Germany 3-2 - Sakshi
Sakshi News home page

FIH Pro League: జర్మనీపై భారత్‌ విజయం

Mar 11 2023 6:32 AM | Updated on Mar 11 2023 10:25 AM

FIH Pro League: Sukhjeet Singh brace helps India beat Germany 3-2 - Sakshi

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీ టోర్నీలో భారత్‌ ఖాతాలో కీలక గెలుపు చేరింది. రూర్కెలాలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3–2 గోల్స్‌ తేడాతో ప్రపంచ చాంపియన్‌ జర్మనీపై సంచలన విజయం సాధించింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (30వ నిమిషం) పెనాల్టీ కార్నర్‌ ద్వారా గోల్‌ సాధించగా... సుఖ్‌జీత్‌ సింగ్‌ రెండు ఫీల్డ్‌ గోల్స్‌ (31వ ని., 42వ ని.) నమోదు చేశాడు.

జర్మనీ నుంచి రెండూ ఫీల్డ్‌ గోల్స్‌ వచ్చాయి. 44వ నిమిషంలో కాఫ్‌మన్‌ పాల్‌ ఫిలిప్, 57వ నిమిషంలో స్ట్రత్‌ఆఫ్‌ మైకేల్‌ గోల్స్‌ కొట్టారు. మూడో క్వార్టర్‌ ముగిసే సరికి భారత్‌ 3–1తో ఆధిక్యంలో నిలిచినా...చివరి క్వార్టర్‌లో జర్మనీ గోల్‌ చేసి ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీని భారత్‌ సద్వినియోగం చేసుకోగలిగింది. భారత్‌ తమ తర్వాతి పోరులో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement