Glenn Maxwell: కోహ్లి 10 వేలు, మాక్సీ 7 వేలు.. ఇప్పుడు చెప్పండిరా! | Glenn Maxwell Teases Virat Kohli After His 7000 Runs in T20s Fans Reactions | Sakshi
Sakshi News home page

Glenn Maxwell: కోహ్లి 10 వేలు, మాక్సీ 7 వేల పరుగులు.. ఇప్పుడు చెప్పండిరా!

Published Thu, Sep 30 2021 11:50 AM | Last Updated on Thu, Sep 30 2021 12:20 PM

Glenn Maxwell Teases Virat Kohli After His 7000 Runs in T20s Fans Reactions - Sakshi

Photo Courtesy: RCB Twitter

Glenn Maxwell teases Virat Kohli: వరుస విజయాల నేపథ్యంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు మాంచి జోష్‌లో ఉన్నారు. ఈసారి ఎలాగైనా టైటిల్‌ గెలవాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఐపీఎల్‌-2021 రెండో అంచె ఆరంభంలో తడబడిన కోహ్లి సేన.. ముంబై ఇండియన్స్‌ను 54 పరుగులతో చిత్తుగా ఓడించి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. ఇక రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ టీ20 ఫార్మాట్‌లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో 152 స్ట్రైక్‌రేటుతో 7 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఒకేరోజు రెండు శుభవార్తల నేపథ్యంలో ఆర్సీబీ డ్రెస్సింగ్‌రూంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మాక్సీ మాట్లాడుతూ.. ‘‘​​కోహ్లి కంటే 3 వేల పరుగులు వెనకే ఉన్నా’’అంటూ మూడు వేళ్లు చూపిస్తూ సరదాగా ఆటపట్టించాడు. మిగతా ఆటగాళ్లు సైతం తాజా విజయం గురించి సంతోషం వ్యక్తం చేశారు.

కాగా ముంబై ఇండియన్స్‌తో మొన్నటి(సెప్టెంబరు 26) మ్యాచ్‌లో కోహ్లి టీ20 ఫార్మాట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో అంచెలో వరుస మ్యాచ్‌లలో వరుస విజయాలు, ఇద్దరు ప్లేయర్లు వరుసగా చెరో మైలురాయి చేరుకోవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ‘‘గెలుస్తూనే ఉంటాం. మాక్సీ, కోహ్లి భాయ్‌ మీరు సూపర్‌. మరిన్ని విజయాలు సాధించాలి. కోహ్లి 10 వేలు, మాక్సీ 7 వేలు.. మావాళ్ల గురించి ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు. మా ఆర్సీబీ గురించి మాట్లాడండి.. ఈసారి కప్‌ మాదేరోయ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీమ్స్‌తో సందడి చేస్తున్నారు.

చదవండి: Sanju Samson: పెద్దగా నష్టపోయేదేమీ లేదు.. విచిత్రాలు జరుగుతాయి.. కాబట్టి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement