
PC: (X.com)
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్‌ప్రీత్ బ్రార్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. హర్‌ప్రీత్ అద్బుతమైన క్యాచ్‌తో గుజరాత్ ఆటగాడు విజయ్ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 18 ఓవర్‌లో కగిసో రబాడ నాలుగో బంతిని విజయ్ శంకర్‌కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు.
ఈ క్రమంలో శంకర్ లాంగాఫ్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగాఫ్‌లో ఉన్న హర్‌ప్రీత్ బ్రార్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
దీంతో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న గుజరాత్ ఫ్యాన్ ఒక అమ్మాయి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Sitaraman (@Sitaraman112971) April 4, 2024
Comments
Please login to add a commentAdd a comment