'Super-8' లో ఆసీస్‌ భారత్‌ పోరు.. ముందుగానే ఫిక్స్‌ ! ఎలా అంటే? | How Pre-Decided Team Seeding Sets Up India Vs Australia T20 World Cup Super-8 Match, See Details Inside | Sakshi
Sakshi News home page

T20 WC 2024: 'Super-8' లో ఆసీస్‌ భారత్‌ పోరు.. ముందుగానే ఫిక్స్‌ ! ఎలా అంటే?

Published Thu, Jun 13 2024 12:50 PM | Last Updated on Thu, Jun 13 2024 2:37 PM

How Pre-Decided Team Seeding Sets up India vs Australia T20 World Cup Super-8 Match

టీ20 వరల్డ్‌కప్‌-2024 లీగ్‌ మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నాయి. జూన్‌ 17తో లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగియునున్నాయి. ఇప్పటికే ప్రతీ గ్రూపు నుంచి ఒక్కో జట్టు తమ సూపర్‌-8 బెర్త్‌ను ఖారారు చేసుకున్నాయి. ఈ క్రమంలో సూపర్‌-8 సమీకరణాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. 

ఈ మెగా టోర్నీలో బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. గ్రూపు-ఏ నుంచి సూపర్‌-8కు క్వాలిఫై అయింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్‌ మూడింట కూడా విజయం సాధించి గ్రూపు-ఏ పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. గ్రూపు-ఎ నుంచి మరో సూపర్‌-8 బెర్త్‌ కోసం అమెరికా, పాకిస్తాన్‌ పోటీ పడతున్నాయి.

మరోవైపు నమీబియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా గ్రూపు-బి నుంచి సూపర్‌ 8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆసీస్‌ కూడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది గ్రూపు-బి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. గ్రూపు-బి నుంచి మరో స్ధానం కోసం స్కాట్లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లు పోటీలో ఉన్నాయి.

అదేవిధంగా గురువారం న్యూజిలాండ్‌ను 13 పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్‌ గ్రూపు-సి సూపర్‌-8కు అర్హత సాధించింది. విండీస్‌ కూడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది గ్రూపు-సి పాయింట్ల పట్టికలో తొలి స్ధానంలో ఉంది. గ్రూపు-సి నుంచి రెండో జట్టుగా అఫ్గానిస్తాన్‌ సూపర్‌-8 క్వాలిఫై అవకాశం ఉంది.

ఇక చివరగా గ్రూపు-డి నుంచి దక్షిణాఫ్రికా సూపర్‌-8లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించిన ప్రోటీస్‌ తమ సూపర్‌-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. గ్రూపు-డి నుంచి మరో స్ధానం కోసం నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌ పోటీ పడుతున్నాయి.

సూపర్‌-8లో ఆసీస్‌ భారత్‌ పోరు..
సూపర్‌-8 దశ మ్యాచ్‌లు జూన్‌ 19 నుంచి ప్రారంభం కాన్నాయి. కాగా ఈ టోర్నీలో భాగమయ్యే ప్రధాన జట్లకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ముందుగానే సీడింగ్(పొజిషిన్‌)‌ కేటాయించింది. భారత్‌(A1), పాకిస్తాన్‌(A2), ఇంగ్లండ్‌(B1), ఆస్ట్రేలియా(B2), న్యూజిలాండ్‌(C1), వెస్టిండీస్‌(C2), దక్షిణాఫ్రికా(D1), శ్రీలంక(D2)గా ఫిక్స్‌ చేశారు. 

అంటే గ్రూపు స్టేజిలో పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిస్తే చాలు స్థానంతో సంబంధం లేకుండా సీడింగ్‌ ఆధారంగా ఆయా జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఉదాహరణకు గ్రూపు-ఎలో భారత్‌ పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచినప్పటికి ఏ1 గానే సూపర్‌-8కు క్వాలిఫై అవుతోంది. 

అదేవిధంగా సీడింగ్‌ కెటాయించిన జట్ల లీగ్‌ స్టేజిలో ఇంటిముఖం పడితే.. ఆ గ్రూపులో టాప్‌-2లో నిలిచిన జట్లు ఆయా స్ధానాలను భర్తీ చేస్తాయి. అయితే లీగ్‌ స్టేజీలో మొత్తం 20 జట్లను మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించిన సంగతి తెలిసిందే. గ్రూపు-ఎ, గ్రూపు-బి, గ్రూపు-సి, గ్రూపు-డిగా కేటాయించారు. 

ప్రతీ గ్రూపు నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-8ని కూడా ఐసీసీ రెండు గ్రూపులుగా విభజించింది. గ్రూపు-1లో ఎ1, బి2, సి1, డి2.. గ్రూపు-2లో ఎ2, బి1, సి2, డి1 జట్లు సూపర్‌-8 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సమీకరణాలుప్రకారం సూపర్‌-8 రౌండ్‌లో జూన్‌ 23న గ్రూపు-2లో భాగంగా వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. 

అదేవిధంగా జూన్‌ 24 గ్రూపు-1లో భాగంగా సెయింట్‌ లూసియా వేదికగా భారత్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడన్నాయి. సూపర్‌-8 గ్రూపు 1లో టీమిండియా(ఎ1), ఆస్ట్రేలియా(బి2) జట్లు ఉన్నాయి. అంతకంటే ముందు జూన్‌ 20న గ్రూపు స్టేజిలో సి1గా నిలిచిన జట్టుతో భారత్‌ తొలి సూపర్‌-8 మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత జూన్‌ 22న గ్రూపు స్టేజిలో డి2గా నిలిచిన జట్టుతో భారత్‌ తమ రెండో మ్యాచ్‌ ఆడనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement