జడ్డూ దెబ్బకు స్మిత్ బౌల్డ్ (PC: BCCI/Disney+Hotstar)
India vs Australia, 4th Test Jadeja Bowled Smith Video: టీమిండియాతో సిరీస్.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023.. నిర్ణయాత్మక నాలుగో టెస్టు... తొలి రోజు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. టీ బ్రేక్ సమయానికి స్కోరు 149-2. అప్పటికి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (15.3ఓవర్లో), పేసర్ మహ్మద్ షమీ(22.2 ఓవరల్లో) చెరో వికెట్ పడగొట్టారు. వరుసగా ట్రావిస్ హెడ్(32), మార్నస్ లబుషేన్(3) వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఆ తర్వాత మూడో వికెట్ తీసేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను మారుస్తూనే ఉన్నాడు. అయినా.. ఫలితం శూన్యం. వన్‌డౌన్ బ్యాటర్ లబుషేన్ అవుటైన తర్వాత దాదాపు మరో 40 ఓవర్ల వరకు టీమిండియాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. స్కోరేమో పెరుగుతూనే ఉంది.
జడ్డూ చేసెను అద్భుతం
ఇలాంటి దశలో 63.4 ఓవర్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు అండగా నిలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను బౌల్డ్ చేశాడు. 135 బంతులు ఎదుర్కొని పట్టుదలగా నిలబడి.. వికెట్ పడకుండా జాగ్రత్తపడిన స్మిత్‌ను అవుట్ చేసి 79 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన జోడీని విడగొట్టాడు.
బ్యాట్‌ను నేలకేసి కొడుతూ..
జడ్డూ సంధించిన బంతిని ఆఫ్‌సైడ్ దిశగా ఆడాలని స్మిత్ భావించగా.. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్టంప్స్‌ను ఎగురకొట్టడంతో అతడి ఇన్నింగ్స్(38)కు తెరపడింది. దీంతో రోహిత్ సేనకు మంచి బ్రేక్ లభించింది. జడ్డూ స్పిన్ మాయాజాలానికి బిత్తరపోయిన స్మిత్.. బౌల్డ్ అవటాన్ని జీర్ణించుకోలేక బ్యాట్‌ను నేలకేసి కొట్టి అసహనం ప్రదర్శించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అవసరమైన సమయంలో బ్రేక్ అందించావు.. నువ్వు సూపర్ జడ్డూ! స్మిత్.. నీకు మరీ అంత ఓవరాక్షన్ అవసరం లేదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సిరీస్‌లో జడేజా ఇప్పటి వరకు లబుషేన్‌ను నాలుగుసార్లు, స్మిత్ మూడు సార్లు అవుట్ చేయడం గమనార్హం. ఇక హ్యాండ్స్‌కోంబ్(17) రూపంలో షమీ టీమిండియాకు నాలుగో వికెట్ అందించాడు.
చదవండి: BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు..
PSL 2023: క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద సిక్స్.. స్టేడియం బయటికి బంతి! వీడియో వైరల్
Jadeja has taken Labuschagne 4 times & Smith 3 times in BGT 2023.
— Johns. (@CricCrazyJohns) March 9, 2023
What a great cricketer. pic.twitter.com/Hdqofblqgf
Comments
Please login to add a commentAdd a comment