ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేల్లో ఆసీస్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయంతో సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆదిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఇక ఈ విజయంతో భారత్ ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది.
ప్రస్తుతం భారత్ మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టి20) టాప్ ర్యాంక్‌లో ఉండటం విశేషం. అంతేకాకుండా మొహాలీలో భారత్‌కే ఇదే తొలి వన్డే విజయం ఆస్ట్రేలియా నిర్ధేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్‌మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) రాణించారు.
అంతకుముందు భారత పేసర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 276 పరుగులకు ఆలౌటైంది. ఇక తొలి వన్డేలో విజయంపై టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించడంతో విజయం సాధించామని రాహుల్ తెలిపాడు.
వారిద్దరూ అద్బుతం..
"కెప్టెన్సీ నాకేమి ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే కెప్టెన్‌గా చాలా మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాను. ఒక సారథిగా జట్టును ఎలా నడిపించాలో నేను అలవాటుపడ్డాను. కెప్టెన్సీ అంటే నాకు చాలా ఇష్టం. కోలంబోలో ఆడి వచ్చిన అనుభవంతో ఈ మ్యాచ్ ప్రారంభంలో మైదాన పరిస్థితులు స్వర్గాన్ని తలపించాయి. కానీ మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్ధితుల్లో ఆడటం చాలా కష్టం. ఫిజికల్‌గా కూడా సవాలుగా ఉంటుంది. కానీ మేముందరం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాం. అదే మైదానంలో చూపించాం
మేము ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లలతో మాత్రమే బరిలోకి దిగాం. కాబట్టి ప్రతీ ఒక్క బౌలర్ కూడా వారి 10 ఓవర్ల కోటాను పూర్తిచేయాల్సి వచ్చింది. కాగా షమీ మా ఫ్రంట్‌లైన్ బౌలర్. అతడు మరోసారి తన అనుభవాన్ని చాటుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు రుతు, గిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే శుబ్‌మన్ ఆఖరి వరకు ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేస్తాడని భావించాను.
కానీ గిల్ ఔట్ అయిన తర్వాత ఒక్కసారిగా పరిస్ధితులు మారినట్లు అన్పించింది. ఈ సమయంలో ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పితే చాలు విజయానికి చేరువవ్వచ్చు అని భావించాను. కానీ కిషన్ కూడా తొందరగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత సూర్యతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగాను. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్.
సూర్య, నేను తరుచూ మాట్లాడుకున్నాం. ఎలాంటి షాట్స్ ఆడాలనేదానిపై చర్చించుకున్నాం. మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకువెళ్లాలని నిర్ణయించకున్నాం. అందుకే ఆచి తూచి ఆడాం. మా బ్యాటర్లందరూ అద్బుతంగా స్ట్రైక్ రోటాట్ చేశారు. ఇదే రిథమ్‌ను తదుపరి మ్యాచ్‌లో కూడా కొనసాగిస్తామని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రాహుల్ పేర్కొన్నాడు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment