వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు భారత జట్టు మరో కీలక పోరుకు సిద్దమైంది. వరల్డ్‌కప్ ప్రిపేరేషన్‌లో భాగంగా స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. శుక్రవారం(సెప్టెంబర్22) మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఇక ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కుల్దీప్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఆఖరి వన్డేకు వీరి నలుగురు జట్టుతో కలవనున్నారు.
ఇక రోహిత్ గైర్హజరీ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు. ఇక ఆసీస్ సిరీస్‌లో భారత సారధిగా ఎంపికైన రాహుల్ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందో ఓ లూక్కేద్దం.
రాహుల్ కెప్టెన్సీ కొత్త కాదు..
కేఎల్ రాహుల్‌కు టీమిండియా కెప్టెన్సీ ఇదేమి మొదటి సారికాదు. ఇప్పటివరకు అతడు మూడు ఫార్మాట్‌లలో కలిపి 11 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. వన్డేల్లో 7 మ్యాచ్‌ల్లో టీమిండియాకు కేఎల్ నాయకత్వం వహించగా.. నాలుగింటిలో జట్టు విజయం సాధించింది. అతడు చివరగా గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించాడు.
బంగ్లాతో తొలి వన్డేలో గాయపడిన రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో రాహుల్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే ఈ సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. కానీ ఆఖరి వన్డేలో మాత్రం బంగ్లాను రాహుల్ సారథ్యంలోని భారత జట్టు చిత్తు చేసింది. ఏకంగా 227 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్(210) డబుల్ సెంచరీతో చెలరేగాడు.
Comments
Please login to add a commentAdd a comment