Ind Vs Aus: Rohit Sharma Heard Saying Pagal Hai Thoda Goes Viral - Sakshi
Sakshi News home page

Rohit- Jadeja: అసలే అతడికి కాస్త పిచ్చి.. నువ్వెందుకిలా? జడ్డూకు రోహిత్‌ వార్నింగ్‌!

Published Fri, Feb 10 2023 3:48 PM | Last Updated on Fri, Feb 10 2023 4:15 PM

Ind Vs Aus: Rohit Sharma Heard Saying Pagal Hai Thoda Goes Viral - Sakshi

India vs Australia, 1st Test: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 212 బంతులు ఎదుర్కొన్న అతడు 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు సాధించాడు. సహచర ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌(20), రవిచంద్రన్‌ అశ్విన్‌(23), ఛతేశ్వర్‌ పుజారా(7) విరాట్‌ కోహ్లి(12), సూర్యకుమార్‌ యాదవ్‌(8) విఫలమైన వేళ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

ఆసీస్‌పై ఆధిక్యంలో కొనసాగేలా జట్టును ముందుకు నడిపాడు. ఇదిలా ఉంటే.. కంగారూ జట్టు పతనాన్ని శాసించిన స్టార్‌ స్పిన్నర్‌ రవీంద​ జడేజాతో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 77వ ఓవర్‌ వేసిన మార్నస్‌ లబుషేన్‌ బౌలింగ్‌లో రెండో బంతిని ఎదుర్కొన్న జడేజా.. సింగిల్‌ తీశాడు.

అసలే అతడికి కాస్త పిచ్చి!
ఆ తర్వాత మరో పరుగుకు యత్నించి మధ్య వరకు దూసుకొచ్చాడు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్‌ స్మిత్‌ వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ వైపు విసరగా అతడు క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో, స్ట్రైకర్‌ ఎండ్‌లో రోహిత్‌ శర్మ అప్పటికే స్మిత్‌ చేతిలో బంతిని చూసి.. ‘‘అసలే అతడికి కాస్తంత పిచ్చి ఉంది.. నిజంగా పాగలే’’ అంటూ కామెంట్‌ చేశాడు.

స్మిత్‌ కావాలనే బంతిని విసరడంలో ఆలస్యం చేస్తున్నాడన్న ఉద్దేశంలో.. కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ జడ్డూను హెచ్చరించాడు. సింగిల్‌ చాలని జడ్డూను వారించాడు. ఇందుకు సంబంధించి వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో బంతితో అద్భుతం చేసిన జడ్డూ.. రెండో రోజు ఆటలో భాగంగా హాఫ్‌ సెంచరీ సాధించాడు.

చదవండి: Ind Vs Aus: అక్కడ ఆడటం ఈజీ కాదన్న షంసీ! చెత్త వాగకు అంటూ కౌంటర్‌
Todd Murphy: లియోన్‌ అనుకుంటే డెబ్యూ బౌలర్‌ ఇరగదీశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement