గిల్- కోహ్లి (PC: BCCI)
India vs Australia, 4th Test- Shubman Gill- Virat Kohli: టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అద్భుత ఆట తీరుతో టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. కాగా బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు సెంచరీ నమోదు చేసిన గిల్.. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.
అయితే, సీనియర్ కేఎల్ రాహుల్ కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయాడు. రాహుల్ విఫలమైనప్పటికీ అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం.. గిల్‌ను పక్కనపెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో ఎట్టకేలకు ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో రాహుల్ స్థానంలో గిల్‌ను ఆడించింది మేనేజ్‌మెంట్. అయితే, ఆ మ్యాచ్‌లో గిల్ ఆకట్టుకోలేకపోయాడు. అందరు బ్యాటర్లలాగే తానూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు.
బౌండరీతో సెంచరీ
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే నాలుగో టెస్టులో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే తుది పోరుకు అర్హత సాధించిన ఆసీస్ అహ్మదాబాద్‌లో తొలి రోజు నుంచే ఆధిపత్యం కనబరిచింది.
ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్ సెంచరీల కారణంగా 480 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం నాటి రెండో రోజు ఆట ఆఖర్లో బ్యాటింగ్ మొదలుపెట్టింది టీమిండియా.
ఈ క్రమంలో మూడో రోజు ఆట ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (35)ఆసీస్ స్పిన్నర్ కుహ్నెమన్ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 74-1. ఇలాంటి దశలో వన్‌డౌన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాతో కలిసి గిల్ మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
సొంతగడ్డపై తొలి సెంచరీ
వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే అద్భుత షాట్లతో అలరిస్తూ బౌండరీతో శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా టెస్టుల్లో రెండో సెంచరీ సాధించిన గిల్‌కు ఆస్ట్రేలియాపై ఇదే మొదటిది. అదే విధంగా సొంతగడ్డపై తొలి శతకం. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో ఇప్పటి వరకు ఓవరాల్‌గా ఇరు జట్ల బ్యాటర్లలో శతకం బాదిన నాలుగో ఆటగాడిగా గిల్ నిలిచాడు.
కోహ్లి రియాక్షన్ వైరల్
ఈ యువ ఓపెనర్ కారణంగా టీమిండియా ఆసీస్‌కు గట్టిగా బదులివ్వగలుగుతోంది. ఈ క్రమంలో గిల్ ఇన్నింగ్స్‌కు ముచ్చటపడిన విరాట్ కోహ్లి ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. డగౌట్‌లో ఉన్న కోహ్లి గిల్ సెంచరీ చేసిన వెంటనే నిలబడి చప్పట్లు కొడుతూ అతడిని అభినందించాడు.
ఇక గిల్ శతకం పూర్తైన తర్వాత పుజారా ఎల్బీడబ్ల్యూ కావడంతో మైదానంలో అడుగుపెట్టిన కోహ్లి.. గిల్‌కు చేయి అందించి అతడిని ప్రశంసించాడు. కాగా నాథన్ లియోన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కావడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. 235 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, ఒక సిక్సర్‌సాయంతో 128 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
చదవండి: Ind Vs Aus: కోహ్లికి సాధ్యం కాలేదు.. పుజారా సాధించాడు! ‘తొలి బ్యాటర్’గా..
Rohit Sharma: రోహిత్ అరుదైన రికార్డు.. సచిన్, కోహ్లితో పాటు ఆ జాబితాలో! అజారుద్దీన్ తర్వాత..
Kohli appreciated Gill soon after he came to bat.
— Johns. (@CricCrazyJohns) March 11, 2023
The bond of Kohli - Gill. pic.twitter.com/ppLgCCtrhr
1st Test 💯 against Australia! 👏@ShubmanGill carries on his purple patch and brings up a superlative ton! 😍
— Star Sports (@StarSportsIndia) March 11, 2023
Sensational knock by the youngster!
Tune-in to LIVE action in the Mastercard #INDvAUS Test on Star Sports & Disney+Hotstar! #BelieveInBlue #TestByFire #Cricket pic.twitter.com/ySyYGsqW06
One of the most iconic pictures I feel Gill and Kohli pic.twitter.com/ccKB0encmK
— Archer (@poserarcher) March 11, 2023
Comments
Please login to add a commentAdd a comment