టెస్ట్‌ల్లో శుభ్‌మన్ గిల్ పేలవ ఫామ్ కొనసాగుతుంది. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అతను మరోసారి విఫలమయ్యాడు. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో పర్వాలేదనుకున్న సమయంలో గిల్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బెన్ ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో గిల్ వైఫల్యాలకు పుల్‌స్టాప్ పడకపోవడంతో అభిమానులు విరక్తి చెందారు.
ఇక మీ సేవలు చాలు బాబు అంటూ గిల్‌ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తుండటంపై అభిమానులు సెలెక్టర్లకు సైతం చురకలు అంటిస్తున్నారు. ఇచ్చిన అవకాశాలు చాలు.. సార్ వారిని సాగనంపండని అంటున్నారు. గిల్‌ను రెండో టెస్ట్‌కు ఎంపిక చేసే మేనేజ్‌మెంట్ పెద్ద తప్పు చేసిందని, ఇతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
కాగా, గిల్ గత 11 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో కేవలం 194 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. గత 11 ఇన్నింగ్స్‌ల్లో అతని స్కోర్లు ఇలా ఉన్నాయి. 34, 0, 23, 10, 36, 26, 2, 29 నాటౌట్, 10, 6, 18.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో గిల్ విఫలమైనా, మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం జైస్వాల్ 166 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 85.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 301గా (తొలి ఇన్నింగ్స్) ఉంది. జైస్వాల్‌కు జతగా శ్రీకర్ భరత్ క్రీజ్‌లో ఉన్నాడు.
రోహిత్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27), అక్షర్ పటేల్ (27) నిరాశపరిచగా.. అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ (32) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ షోయబ్ బషీర్ 2, ఆండర్సన్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment