టెస్టు క్రికెట్‌లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎట్టకేలకు తిరిగి తన ఫామ్‌ను పొందాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లు 128 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
30 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను.. గిల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ముందుకు నడిపించాడు. ఓవరాల్‌గా 104 పరుగులుచేసి గిల్ ఔటయ్యాడు. కాగా గిల్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ. తన మూడో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి గిల్‌కు 12 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది.
చివరగా గతేడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో గిల్ సెంచరీ చేశాడు. అయితే ఇటీవల గిల్ వరుసగా విఫలమం కావడంతో తీవ్ర స్ధాయిలో విమర్శల వెల్లువెత్తాయి. తనపై విమర్శల చేసిన వారికి బ్యాట్‌తోనే గిల్ సమాధమిచ్చాడు. ఈ నేపథ్యంలో అద్బుత సెంచరీతో చెలరేగిన గిల్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రిన్స్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రెండో టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. 55 ఓవర్లకు భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. టీమిండియా ప్రస్తుతం 354 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment