మ్యాచ్ రద్దు
వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. వెల్లింగ్టన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో.. ఒక బంతి కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు
టాస్ ఆలస్యం
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 11:30 గంటలకు పడాల్సిన టాస్ ఇప్పడు ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం వర్షం తగ్గుమఖం పట్టింది. ఈ క్రమంలో గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని సిద్దం చేసే పనిలో పడ్డారు.
ఇక ఈ సిరీస్‌కు భారత స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. ఈ సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. అదే విధంగా తొలి సారి భారత టీ20 జట్టుకు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. ఇక సిరీస్ అనంతరం భారత జట్టు కివీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేపట్టనున్నాడు.
టీ20 సిరీస్‌కు భారత జట్టు..
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
చదవండి: IPL 2023: విలియమ్సన్‌పై కన్నేసిన ఐపీఎల్ జట్టు ఇదే..? మరీ అన్ని కోట్లా!
Comments
Please login to add a commentAdd a comment