Controversial DRS decision cuts short Virat Kohli departs on duck: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వివాదాస్పద రీతిలో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లి ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 30 ఓవర్ వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్‌లో.. విరాట్ కోహ్లి ఢిపెన్స్ ఆడడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో బంతి మిస్స్ అయ్యి ఫ్యాడ్స్‌ని తాకింది.
దీంతో బౌలర్ అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి ఔట్ గా ప్రకటించాడు. అయితే వెంటనే కోహ్లి రివ్యూకు వెళ్లాడు. రీప్లేలో బంతి మొదట బ్యాట్‌కి తగిలి ప్యాడ్‌కి తగిలినట్లుగా అనిపించింది. రీప్లేలో పలుకోణాల్లో విజువల్స్ పరిశీలించిన థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ కు దాన్ని నిర్ధారించడం కష్టంగా మారింది.
బాల్ ట్రాకింగ్‌లో బంతి స్టంప్‌లను తాకడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఆధారంగా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ నిర్ణయం వివాదాస్పదం అయింది. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి చెందాడు. విరాట్ కోహ్లిని అవుట్‌గా ప్రకటించడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
థర్డ్ అంపైర్ నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర స్ధాయిలో మండి పడుతున్నారు. ఇదేం చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో యూజర్ పాత కక్షలతోనే వీరేందర్ శర్మ ఔట్‌గా ప్రకటించాడాని కామెంట్ చేశాడు. కాగా గతంలో ఐపీఎల్‌లో వీరేందర్ శర్మ నిర్ణయాల పట్ల చాలా సార్లు కోహ్లి గొడవపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలును అభిమానులు ప్రస్తుతం ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: IND vs NZ 2nd Test: 11 ఏళ్లలో ఒకే ఒక్కడు.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక్
Today #IndvsNZtest Virendra Sharma again....#ViratKohli #viratkholi #Virendrasharma #umpire
— Aishwary Tiwari (@The_aishwary_) December 3, 2021
Virendra sharma while Umpiring: https://t.co/OLSUoztO2F pic.twitter.com/0dlamt25Jf
Clearly not out!
— kapil jetwani (@KapilJetwani) December 3, 2021
What di you think??#IndvsNZtest #viratkholi #ViratKohli #notout pic.twitter.com/rx3SKOtjECWorst Umpiring by Virender Sharma. The ball hit the bat first, then on the pad and it was clearly visible. Even after looking so clear, the umpire declared Virat Kholi out!!! 😠😠 #indvsnz #virendrasharma#IndvsNZtest #MumbaiTest #ViratKohli pic.twitter.com/5jQQxKNX8F
— Manpreet Singh CHANDU (@ManpreetChandu) December 3, 2021
Comments
Please login to add a commentAdd a comment