హార్దిక్ పాండ్యా- విరాట్ కోహ్లి (PC: Twitter)
India vs Sri Lanka, 1st ODI- Virat Kohli: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి డాట్ బాల్స్ అస్సలు ఇష్టం ఉండదు! వీలైతే బౌండరీలు, సిక్సర్లు బాదడం లేదంటే.. వికెట్ల మధ్య పరుగులు తీసైనా.. స్కోరు బోర్డును ముందుకు నడపడం! తనే కాదు.. నాన్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ కూడా తనలాగే పరుగులు తీయాలని కోహ్లి కోరుకుంటాడనే విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది కూడా!
ఒకవేళ పరుగుకు యత్నించినపుడు సహచర బ్యాటర్ నుంచి సరైన స్పందన లేకుంటే కోహ్లి రియాక్షన్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. శ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇది అనుభవంలోకి వచ్చింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 43వ ఓవర్‌లో.. కసున్ రజిత బౌలింగ్‌లో ఆఖరి బంతికి కోహ్లి స్వేర్‌లెగ్ మీదుగా బంతిని బాదాడు.
రనౌట్ అయ్యేవాడే!
ఈ క్రమంలో సింగిల్ కోసం యత్నించాడు కోహ్లి. అప్పటికే క్రీజును వీడి సగం దూరం వరకు వచ్చాడు. కానీ.. అటువైపునున్న పాండ్యా పరుగుకు నిరాకరించాడు. అయితే, అంతేవేగంగా వెనక్కి పరుగు తీయడంతో కోహ్లి రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఈ ఘటన నేపథ్యంలో కోహ్లి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాండ్యాపై గుడ్లురిమిన కోహ్లి ఇదేంటన్నట్లుగా కళ్లతోనే ప్రశ్నించాడు. కాగా 81 పరుగులతో అప్పటికే మంచి ఊపు మీదున్న కోహ్లి రనౌట్ అయితే, సెంచరీ మిస్ అయ్యేవాడే! ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లి.. కెరీర్‌లో 73వ శతకం సాధించాడు. మరోవైపు పాండ్యా.. 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్... శ్రీలంకపై 67 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
చదవండి: Rohit Sharma: అందుకే ఆ రనౌట్ అప్పీలు వెనక్కి తీసుకున్నాం.. ఇక షమీ! లవ్ యూ భాయ్..
WTC: భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. మూడున్నరేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ
— Guess Karo (@KuchNahiUkhada) January 10, 2023
That's that from the 1st ODI.#TeamIndia win by 67 runs and take a 1-0 lead in the series.
— BCCI (@BCCI) January 10, 2023
Scorecard - https://t.co/262rcUdafb #INDvSL @mastercardindia pic.twitter.com/KVRiLOf2uf
Comments
Please login to add a commentAdd a comment