Ind Vs Sl 1st ODI: Rohit Sharma Interacts With Crying Young Fan Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rohit Sharma: ఎందుకు ఏడుస్తున్నావు? నీ బూరె బుగ్గలు భలే బాగున్నాయి! వీడియో వైరల్‌

Published Tue, Jan 10 2023 11:59 AM | Last Updated on Tue, Jan 10 2023 12:39 PM

IND vs SL: Rohit Sharma Gesture With Crying Young Fan Goes Viral - Sakshi

చిన్నారి అభిమానిని ముద్దు చేస్తున్న రోహిత్‌ (PC: Twitter Video Grab)

India vs Sri Lanka, 1st ODI - Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంకతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో తిరిగి జట్టుతో కలిశాడు. అతడి సారథ్యంలో గువహటిలోని బర్సపర స్టేడియం వేదికగా భారత జట్టు లంకతో తొలి వన్డే ఆడనుంది. ఈ క్రమంలో మంగళవారం నాటి ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌ మీడియాతో ముచ్చటించాడు.

ఏడ్చేసిన బుడ్డోడు
ఈ సందర్భంగా జట్టు వివరాలు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, తన టీ20 కెరీర్‌ తదితర విషయాల గురించి మాట్లాడాడు. అయితే, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ముగిసిన తర్వాత తనను చూడటానికి వచ్చిన ఫ్యాన్స్‌తో రోహిత్‌ శర్మ కాసేపు ముచ్చటించాడు. వారిలో ఓ బుల్లి అభిమాని హిట్‌మ్యాన్‌ను చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. 

నీ బూరె బుగ్గలు భలే బాగున్నాయే!
అయితే, రోహిత్‌ అతడిని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆప్యాయంగా ఆ పిల్లాడి బుగ్గలు నిమురుతూ.. ‘‘ఎందుకు ఏడుస్తున్నావు? చిన్న పిల్లోడివి నువ్వు! నీ బూరె బుగ్గలు భలే బాగున్నాయే!’’ అన్న చందంగా హిట్‌మ్యాన్‌ అతడిని ముద్దు చేశాడు. తర్వాత తనతో సెల్ఫీ కూడా దిగి సంతోషాన్ని రెట్టింపు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అసోం నేత ప్రమోద్‌ బోరో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌ అవుతోంది.

ఇది చూసిన రోహిత్‌ ఫ్యాన్స్‌.. ‘‘అందుకే మేము నిన్నంతగా ప్రేమించేది! బుడ్డోడి పట్ల నీ స్పందన హృదయానికి హత్తుకుంది. లవ్‌యూ భాయ్‌’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో లంకతో టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా.. రోహిత్‌ శర్మ నేతృత్వంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది.

చదవండి: Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్‌ తర్వాత!
Ind Vs SL: సూర్య, ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement