Ind Vs WI 2nd T20: Rohit Sharma Praises Virat Kohli Over His Half Century - Sakshi
Sakshi News home page

Rohit Sharma-Virat Kohli: అద్భుతమైన షాట్లు.. అలా ఆడటం తనకే సొంతం.. కోహ్లిపై రోహిత్‌ ప్రశంసలు

Published Sat, Feb 19 2022 9:26 AM | Last Updated on Sat, Feb 19 2022 10:31 AM

Ind Vs Wi 2nd T20: Rohit Sharma Lauds Virat Kohli For His Half Century - Sakshi

Ind Vs Wi 2nd T20: వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించిన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిని అధిగమించి... చూడచక్కని షాట్లతో చెలరేగడం అతడికే చెల్లిందన్నాడు. జట్టు విజయంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20లో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 8 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

ఇక వన్డే సిరీస్‌ సహా.. మొదటి టీ20 వరకు ఫామ్‌లేమితో సతమతమైన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌ ఝులిపించాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(19), ఇషాన్‌ కిషన్‌(2) విఫలమైన వేళ.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 52 పరుగులు సాధించాడు. కోహ్లికి తోడు రిషభ్‌ పంత్‌ సైతం అద్భుత అర్ధ శతకంతో రాణించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోహ్లి ప్రదర్శన గురించి మాట్లాడుతూ... ‘‘జట్టుకు అవసరమైన సమయంలో విరాట్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టు బాధ్యతను తలకెత్తుకున్నాడు. నిజానికి మొదటి రెండు ఓవర్లలో మా ప్రదర్శన బాగాలేదు. అయినా.. తను ఒత్తిడిని అధిగమించి కంటికి ఇంపైన షాట్లతో అదరగొట్టాడు. ముఖ్యమైన ఇన్నింగ్స్‌ ఆడాడు’’ అని ప్రశంసించాడు. ఇక విరాట్‌ ఫామ్‌పై విమర్శలు వచ్చిన సమయంలో రోహిత్‌ అతడికి అండగా నిలబడ్డ సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2022 Auction: వేలంలో 1.5 కోట్లు.. భారత జట్టు సభ్యుడు, సీఎస్‌కే ఆటగాడిపై సంచలన ఆరోపణలు! ధోని నమ్మకం గెలిచాడు కానీ..
తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement