West Indies vs India, 2nd Test- Virat Kohli Multiple Milestones: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రికార్డుల రారాజు అన్న తన బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా.. అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్లకు అత్యంత అరుదుగా సాధ్యమయ్యే ఫీట్‌ను కింగ్ సాధించిన విషయం తెలిసిందే. తన పదిహేనేళ్ల కెరీర్‌లో 500వ మ్యాచ్ అనే మైలురాయిని చేరుకున్నాడు.
చారిత్రాత్మక టెస్టులో
ఇక టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఇది చారిత్రాత్మక వందో టెస్టు కూడా విశేషం. ఈ నేపథ్యంలో ఈ అత్యంత ప్రత్యేకమైన మ్యాచ్‌లోనూ రన్‌మెషీన్ తనదైన ముద్ర వేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి అర్ధ శతకంతో మెరిశాడు.
వరల్డ్ రికార్డు
ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో విండీస్‌తో గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 161 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఖాతాలో ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. 500వ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రన్‌మెషీన్ చరిత్ర సృష్టించాడు.
కోహ్లి కంటే ముందు 9 మంది క్రికెటర్లు 500 మ్యాచ్‌ల మార్కు అందుకున్నప్పటికీ మునుపెన్నడూ వీరికి ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఇప్పటికే సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న విరాట్ ఈ అరుదైన ఘనత సాధించి శిఖరాగ్రాన నిలిచాడు.
టాప్-5లో నిలిచి రెండు రికార్డులు
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా.. 34 కోహ్లి మరో రెండు అరుదైన రికార్డులు కూడా సాధించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ పరుగుల యంత్రం.. విండీస్‌తో రెండు సందర్భంగా 87 పరుగుల వద్ద 25,548 పరుగుల మార్కు(ఇంటర్నేషనల్ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో) అందుకున్నాడు.
తద్వారా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్‌ను వెనక్కినెట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. అదే విధంగా.. టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 7097 పరుగులు పూర్తి చేసుకుని ఈ జాబితాలోనూ టాప్-5లోకి దూసుకువచ్చాడు.
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(57), రోహిత్ శర్మ(80)లతో పాటు కోహ్లి అర్ధ శతకం(87 నాటౌట్)తో రాణించారు. కోహ్లితో పాటు జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
చదవండి: Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే..
Ind Vs WI: ఈసారి యశస్వి మిస్సయ్యాడు! అయితేనేం అరుదైన రికార్డుతో..
50 on 500th 👑
— FanCode (@FanCode) July 20, 2023
.
.#ViratKohli𓃵 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/0EuVH3Ctsb
Comments
Please login to add a commentAdd a comment