IND vs WI: Rohit Sharma Reply on Kohli Form What Are You Saying Man - Sakshi
Sakshi News home page

Rohit Sharma- Virat Kohli: కోహ్లి గురించి ప్రశ్న.. అసలేం మాట్లాడుతున్నావు అన్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Published Sun, Feb 13 2022 1:44 PM | Last Updated on Sun, Feb 13 2022 3:40 PM

Ind Vs Wi: Rohit Sharma Reply On Kohli Form What Are You Saying Man - Sakshi

8, 18, 0... ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ‘రన్‌ మెషీన్‌’, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన పరుగులు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు వన్డేల్లో కలిపి 116 పరుగులతో పర్వాలేదనిపించిన కోహ్లి... స్వదేశంలో మాత్రం పూర్తిగా నిరాశ పరిచాడు. సౌతాఫ్రికా పర్యటనకు ముందు అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మకు బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. 

ఈ క్రమంలో రోహిత్‌ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో మెరుగ్గా రాణించిన కోహ్లి... స్వదేశంలో రోహిత్‌ కెప్టెన్సీలో మాత్రం సరిగ్గా ఆడకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోహ్లి అభద్రతా భావానికి గురవుతున్నాడని, ఆత్మవిశ్వాసం కోల్పోయాడు గనుకే సరిగ్గా ఆడటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మూడో వన్డేలో విజయానంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్‌ శర్మ కోహ్లిపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

‘‘సెంచరీ చేసి చాలా రోజులు అవుతోంది. సరిగ్గా ఆడలేడం లేదు. కోహ్లిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి మేనేజ్‌మెంట్‌ చేయబోతోంది’’ అంటూ ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా రోహిత్‌ అదిరిపోయే సమాధానమిచ్చాడు. ‘‘విరాట్‌ కోహ్లిలో కాన్ఫిడెన్స్‌ నింపాలా? అసలేం మాట్లాడుతున్నారండీ!. తను సెంచరీ చేయకపోవచ్చు. కానీ సౌతాఫ్రికాతో సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అంతా బాగానే ఉంది. తన గురించి మేనేజ్‌మెంట్‌కు ఎటువంటి చింతా లేదు’’ అని బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కాగా విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: IPL 2022 Auction Day 2: పుజారాకు భారీ షాక్‌... రహానేకు కోటి.. ప్రపంచకప్‌ ‘విజేత’కు భంగపాటు!
IPL 2022 Auction Unsold Players: అమ్ముడుపోని ఆటగాళ్లకు మరో చాన్స్ .. అదేంటంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement