విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ప్రయోగాలు చేసి ఓటమి పాలైన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తలపడేందుకు సిద్దమైంది. ఆగస్టు 1న ట్రినిడాడ్ వేదికగా భారత్-విండీస్ మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే సిరీస్ 1-1 సమం కావడంతో ఇరు జట్టకు ఈ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు విండీస్ మాత్రం తమ అధిపత్యాన్ని కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది.
రోహిత్, కోహ్లి ఇన్..
ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ తమ వరల్డ్‌కప్ ప్రయోగాలకు ఫుల్‌స్టాప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లిని జట్టులోకి తీసుకురావాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్షర్ పటేల్, సంజూ శాంసన్ మళ్లీ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు సమాచారం. అదేవిధంగా వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
అదే విధంగా తొలి రెండు వన్డేలో దారుణంగా నిరాశపరిచన పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై వేటు పడనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అతడి స్ధానంలో వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్‌ను తుది జట్టులోకి తీసుకునున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వెటరన్ పేసర్ 9 ఏళ్ల నుంచి భారత్ తరపున ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఉనద్కట్ చివరగా 2013లో ఇదే వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్ ఆడాడు. మరోవైపు విండీస్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్ (కెప్టెన్), కీసీ కార్టీ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, జోషఫ్, యానిక్ కారియా, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్.
Comments
Please login to add a commentAdd a comment