Twitter Fumes as India Rest Virat Kohli, Rohit Sharma in 2nd ODI - Sakshi
Sakshi News home page

IND vs WI: పిచ్చి ప్రయోగాలు ఎందుకు? తల పట్టుకున్న విరాట్‌ కోహ్లి! వీడియో వైరల్‌

Published Sun, Jul 30 2023 9:11 AM | Last Updated on Sun, Jul 30 2023 10:45 AM

Twitter Fumes As India Rest Virat Kohli, Rohit Sharma In 2nd ODI  - Sakshi

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. తొలి వన్డేలో ఆటగాళ్ల బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చి ఖంగుతున్న భారత్‌.. రెండో వన్డేలో కూడా అటువంటి పిచ్చి పనులే చేసింది. ఏకంగా ఈ మ్యాచ్‌కు జట్టు మెనెజ్‌మెంట్‌ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మను పక్కన పెట్టింది. దీని ఫలితంగా బార్బోడస్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో విండీస్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది.

వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండంతో ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశంతో సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించారు. కానీ వీరిద్దరూ తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేకపోయారు. విరాట్‌ కోహ్లి స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చిన శాంసన్‌ కేవలం 9 పరుగులు చేయగా.. నాలుగో స్ధానంలో వచ్చిన అక్షర్‌ ఒక్క పరుగు మాత్రమే చేసిన పెవిలియన్‌ చేరాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (55), శుబ్‌మన్‌ గిల్‌(34) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ 40.5 ఓర్లలోనే 181 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 90 పరుగులు భాగస్వామ్యం అందించగా.. మిగితా ఆటగాళ్లంతా కలిసి కేవలం 91 పరుగులు మాత్రమే చేశారు. అనంతరం అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

విండీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హోప్‌ (63 నాటౌట్‌), కార్టీ(48) పరుగులతో రాణించారు. ఇక టీమిండియా తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. వరల్డ్‌కప్‌కు ముందు ఇటువంటి ప్రయోగాలు అవసరమా అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు.

తల పట్టుకున్న కోహ్లి..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన విరాట్‌ కోహ్లిని తీవ్ర నిరాశపరిచింది. డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి మ్యాచ్‌ను వీక్షించిన కోహ్లి.. భారత్‌ ఓటమి పాలవ్వగానే అయ్యో అంటూ తల పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఫ్యాన్స్‌ స్పందిస్తూ.. కింగ్‌ కోహ్లి ఉంటే కఛ్చితంగా ఫలితం మరో విధంగా ఉండేది అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. ఇక మూడో వన్డేకు విరాట్‌ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement