టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో బీజీబీజీగా ఉన్నాడు. కానీ కోహ్లి భారత్‌లో దర్శనమిచ్చాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఈ భూ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. కానీ మనం దానిని పెద్దగా విశ్వసించం. కానీ కొన్ని సందర్భాల్లో అది నిజమని మనం కూడా నమ్ముతాం. అయితే ఇప్పడు విరాట్ కోహ్లి విషయంలో కూడా అదే జరిగింది. అచ్చెం కోహ్లిని పోలిన వ్యక్తి హర్యానాలో ఉన్నాడు.
కార్తీక్ శర్మ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోహ్లి లాంటి లూక్‌తో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాడు. అతడి హెయిర్ కట్ కూడా కోహ్లిలానే ఉంది. అతడు విరాట్ కోహ్లికి వీరాభిమాని. గతంలో అతడు చాలా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆర్సీబీ జెర్సీ ధరించి స్టేడియాల్లో కన్పించాడు కూడా. అతడితో ఫోటోలు కోసం కోహ్లి ఫ్యాన్స్ ఎగబాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజగా కోహ్లి లూక్స్‌తో ఉన్న ఓ వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రమ్ ఖాతాలో కార్తీక్ షేర్ చేశాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. "మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. కానీ నేను విరాట్ కోహ్లిని కాను. నేను హర్యానాకు చెందిన కార్తీక్ శర్మ. నా వృత్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కానీ నేను వెళ్లే ప్రతీ చోట కోహ్లి అనుకుని ఫోటోలు కోసం ఎగబడతారు.
నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అదే విధంగా విరాట్ కోహ్లి నా ఆరాధ్య దైవం. విరాట్‌ను ఒక్కసారి కలిస్తే చాలు ఈ జీవితానికి" అటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్‌గా కార్తీక్ పెట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. విండీస్‌తో టెస్టు సిరీస్‌లో కోహ్లి దుమ్మురేపాడు. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 206 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 11 ఫోర్లతో 121 పరుగులు చేశాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. సంజూ శాంసన్‌కు ఛాన్స్! పాపం కిషన్
Comments
Please login to add a commentAdd a comment