India To Begin Practice for Ind vs WI Today, Kohli Rohit Join Squad - Sakshi
Sakshi News home page

IND vs WI: బీచ్‌లో వాలీబాల్‌ ఆడిన భారత ఆటగాళ్లు.. వీడియో వైరల్‌

Published Mon, Jul 3 2023 3:43 PM | Last Updated on Mon, Jul 3 2023 4:19 PM

India to begin practice for IND vs WI today, Kohli Rohit join squad - Sakshi

వెస్టిం‍డీస్‌ టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు బ్యాచ్‌లగా కరీబియన్‌ దీవులకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాటు విరాట్‌ కోహ్లి,  రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు విండీస్‌ గడ్డపై అడుగుపెట్టారు. ఇక డొమినికా వేదికగా జూలై 12 నుంచి భారత్‌-విండీస్‌ మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. 

కాగా తొలి టెస్టుకు ముందు బార్బడోస్‌లో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 6న స్ధానిక జట్టుతో టీమిండియా తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఫస్ట్‌క్లాస్‌ హోదాలో మాత్రం జరగవు. కొంత లోకల్‌ ప్లేయర్స్‌ భారత జట్టుతో జతకట్టనున్నారు. దీంతో రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు.

వాలీబాల్‌ ఆడిన భారత ఆటగాళ్లు..
ఇక విండీస్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు కరీబియన్‌ దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బీచ్‌ వాలీబాల్‌ సెషన్‌లో టీమిండియా ప్లేయర్స్‌ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో విరాట్‌ కోహ్లి, అశ్విన్‌, శార్ధూల్‌ ఠాకూర్‌ వంటి ఆటగాళ్లు వాలీబాల్‌ ఆడుతూ కన్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వెస్టిండీస్‌తో  టెస్టు 'సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ.

వెస్టిండీస్ సన్నాహక జట్టు: 
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్
చదవండి: బెయిర్‌ స్టో ఔట్‌ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement