ఛటోగ్రామ్ వేదికగా శనివారం బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మూడో వన్డేలో తలపడేందుకు సిద్దమైంది. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పేసర్లు కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమయ్యారు.
దీంతో ఆఖరి వన్డేకు భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ఇక ఈ మ్యాచ్‌కు రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులో వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా దీపక్ చాహర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక యువ ఆటగాళ్లు రాహుల్ త్రిపాఠి, రజిత్ పాటిదార్ మరో సారి బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
కాగా భారత ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్ ప్రారంభించే అవకాశం ఉంది. రాహుల్ మరో సారి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నట్లు సమాచారం. ఇక తొలి రెండు వన్డేల్లో విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ఆఖరి మ్యాచ్‌లోనైనా చెలరేగాలని అభిమానులు భావిస్తున్నారు.
భారత తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అక్షరు పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: WTC 2021-23: విండీస్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియా భారీ స్కోరు! ఫైనల్ చేరే క్రమంలో..
Comments
Please login to add a commentAdd a comment