వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు భారత జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. విండీస్‌తో టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు రోహిత్ శర్మనే సారధ్యం వహించనున్నాడు.
ఇక ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. వీరిద్దరితో పాటు 2021 నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్ నవదీప్ సైనీకి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్ లభించింది.
కాగా భారత సెలక్టర్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజరాను సెలక్టర్లు పక్కన పెట్టారు. అదే విధంగా విండీస్‌తో టెస్టులకు మరో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే వైస్ కెప్టెన్‌గా సెలక్టర్లు నియమించారు. ఇక ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌కు టెస్టు, వన్డే జట్టు రెండింటిలో కూడా సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు.
మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇక విండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే టీ20లకు త్వరలో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. జూలై 12 నుంచి జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment