ఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌కు రాజస్తాన్ రాయల్స్ కొత్త ఉత్సాహంతో సిద్ధమవుతుందని ఆ జట్టు నూతన డైరెక్టర్ కమ్ కోచ్ కుమారసంగక్కర అభిప్రాయపడ్డాడు. స్మిత్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సంజూ శాంసన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. కాగా ఐపీఎల్ 14వ సీజన్‌కు రాజస్తాన్ రాయల్స్ ఏ విధంగా సిద్ధమవుతుందనేది సంగక్కర యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఒక అభిమాని సోషల్ అడిగిన ప్రశ్నకు సంగక్కర ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. ఫుట్‌బాల్ స్టార్‌గా పేరున్న అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీని వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ వేలంలో పరిగణలోకి తీసుకుంటారా అని ఒక అభిమాని ప్రశ్నించాడు.
దీనికి సంగక్కర బదులిస్తూ..'' నువ్వు మాట్లాడేది మెస్సీ గురించేనా.. ఫుట్‌బాల్‌లో దిగ్గజంగా పేరుపొందిన మెస్సీలో మంచి టాలెంట్ ఉంది. ఆ దిశగా చూస్తే మాత్రం మెస్సీలో క్రికెట్ ఆడే లక్షణాలు ఉన్నాయి. అవకాశం ఉంటే మెస్సీని వచ్చే ఏడాది వేలంలో తప్పకుండా తీసుకుంటాం. అని చమత్కరించాడు. ఇక ఈసారి ఐపీఎల్‌కు నూతనోత్సాహంతో బరిలోకి దిగుతున్నాం. బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తున్నా.. జోఫ్రా ఆర్చర్ దూరమవ్వడం కాస్త నిరాశపరిచింది.''అని చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. స్మిత్ సారధ్యంలోని రాయల్స్ జట్టు మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
చదవండి:
IPL 2021: సీఎస్‌కేకు ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment