Photo Courtesy: PTI
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 45 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ముంబైలోని వాంఖడే వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ సీఎస్‌కే తొలుత బ్యాటింగ్ చేసి 188 పరుగులు చేయగా, ఆపై రాజస్థాన్ 143 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి పాలైంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ బట్లర్(49)ధాటిగా ఆడగా మిగతా టాపార్డర్ అంతా విఫలమైంది. ప్రధానంగా బాధ్యాతయుతంగా ఆడాల్సిన సామ్సన్ 5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. సామ్ కరాన్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి బ్రేవోకు క్యాచ్ ఇచ్చి సామ్సన్ పెవిలియన్ చేరాడు.
అనవసరపు షాట్‌కు పోయి వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో సామ్సన్‌కు వచ్చిన వెంటనే దూకుడు అవసరమా అనే విశ్లేషణ మొదలైంది. దీనికి పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సామ్సన్ మాట్లాడుతూ.. తన షాట్లపై ఆంక్షలు అవసరం లేదని కాస్త గట్టిగానే బదులిచ్చాడు. ‘ నా షాట్ల ఎంపిక ఏమిటో నాకు తెలుసు. ఇక్కడ నాకేమీ ఆంక్షలు విధించొద్దు. నా సహజ శైలిలో ఆడతా. అటు సందర్భాల్లో విఫలం కూడా కావొచ్చు.
ఐపీఎల్ అంటేనే రిస్కీ షాట్ల ఫార్మాట్. ఈ ఫార్మాట్ ఏర్పడిందే భారీ షాట్లు కోసం. అందులో రిస్క్ షాట్లే ఎక్కువ ఉంటాయి. నేను సెంచరీ చేసి సక్సెస్ అయిన మ్యాచ్‌లో కూడా రిస్క్ షాట్లే ఆడా. అది ఆ రోజున బట్టి.. మన మైండ్ సెట్‌ను బట్టి ఉంటుంది. నా షాట్ల ఎంపికలో నేను ఎటువంటి ఆంక్షలు పెట్టుకోను. నేను ఎలా ఆడాలనుకుంటోనో అలానే ఆడతా. అలా ఆడటమే నాకిష్టం. అలా ఆడేటప్పుడు విఫలం కూడా అవుతా. దాన్ని అంగీకరించాల్సిందే. నా ఔట్‌పై నాకు ఎటువంటి బెంగలేదు. వచ్చే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయాల్లో నా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా’ అని సామ్సన్ తెలిపాడు.
ఇక్కడ చదవండి: ధోని బ్యాట్ నుంచి మరీ ఎక్కువ ఆశించకూడదు: లారా
90 నిమిషాల్లో వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్..!
Comments
Please login to add a commentAdd a comment