Photo Courtesy: IPL
ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించాడు. కెప్టెన్‌గా ధోని వారసుడు జడ్డూనే అని, అతడిని కేంద్రంగా చేసుకుని చుట్టూ జట్టును నిర్మించాలని సీఎస్‌కే ఫ్రాంఛైజీకి సూచించాడు. ఐపీఎల్-2021 సీజన్‌లో భాగంగా మైదానంలో మెరుపులాంటి ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న జడేజా, భారత్‌లో అత్యుత్తమ ఫీల్డర్ అంటూ వాన్ ఇటీవల కితాబు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాకుండాభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విడుదల చేసిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో రవీంద్ర జడేజాకు ‘ఎ+’ గ్రేడ్ ఇవ్వకపోవడాన్ని కూడా తప్పుబడుతూ అతడికి మద్దతుగా నిలిచాడు. ఇక, తాజాగా.. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించిన అనంతరం క్రిక్‌బజ్‌తో మాట్లాడిన వాన్.. జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన మైండ్‌సెట్ సూపర్బ్
‘‘నిజాయితీగా మాట్లాడుకుంటే, ధోని.. బహుశా.. మరో 2 నుంచి మూడేళ్లు ఆడతాడు అనుకోవచ్చు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? నా అభిప్రాయం ప్రకారం జడేజా నేతృత్వంలో సీఎస్‌కే జట్టును తయారు చేసుకోవాలి. జడేజా మంచి క్రికెటర్. బంతితో రాణించగలడు. బ్యాట్‌తో మెప్పించగలడు. ఫీల్డింగ్‌పరంగా చూస్తే మైదానంలో చురుగ్గా కదలగలడు. తన మైండ్‌సెట్, మెంటాలిటీ సూపర్బ్. జడేజా ఎలాంటి ఆటగాడు అంటే.. ‘‘నాలుగు లేదా ఐదు, లేదంటే అంతకంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగినా, తనతోనే బౌలింగ్ ఓపెనింగ్ చేయించినా, ఫీల్డ్‌లో అతిముఖ్యమైన స్థానాల్లో సెట్ చేసినా.. అన్నింటికీ సిద్ధంగా ఉంటాడు. తను చాలా మంచి క్రికెటర్’’ అంటూ వాన్, జడ్డూను ఆకాశానికెత్తేశాడు. కాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, జడేజా రెండు కీలక వికెట్లు తీయడమే గాకుండా, 4 క్యాచ్‌లు పట్టి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: వైరల్: జడ్డూ.. నువ్వు వెరీ గుడ్డూ.. అంతేగా!
అలా అయితే ధోని సేనదే టైటిల్: బ్రియన్ లారా
Comments
Please login to add a commentAdd a comment