మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి: వార్నర్‌ | IPL 2021: Netizens Sympathizes For David Warner After He Hints SRH Exit | Sakshi
Sakshi News home page

David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు!

Published Tue, Sep 28 2021 9:35 AM | Last Updated on Tue, Sep 28 2021 11:38 AM

IPL 2021: Netizens Sympathizes For David Warner After He Hints SRH Exit - Sakshi

Photo Courtesy: IPL

David Warner Comments Viral: ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుందన్న విశ్లేషణల నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊరట విజయం దక్కింది. ఐపీఎల్‌- 2021 రెండో అంచెలో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే జేసన్‌ రాయ్ అదరగొట్టగా‌, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా హాఫ్‌ సెంచరీతో రాణించడంతో గెలుపు హైదరాబాద్‌ సొంతమైంది. దీంతో ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే సమయంలో డేవిడ్‌ వార్నర్‌ లేని లోటును తలచుకుని బాధపడుతున్నారు. ముఖ్యంగా వార్నర్‌ అన్నను మళ్లీ ఆరెంజ్‌ జెర్సీలో చూస్తామో లేదోనని ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు.

ఇందుకు కారణం.. ఓ నెటిజన్‌ వేసిన ప్రశ్నకు వార్నర్‌ ఇచ్చిన సమాధానమే. అంతేగాక ఎస్‌ఆర్‌హెచ్‌ హెడ్‌కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ కూడా వార్నర్‌ భవిష్యత్తు గురించి ప్రశ్నించగా.. ‘‘ఇంత వరకు ఆ అంశాల గురించి ఆలోచించలేదు. మెగా వేలం ముందుంది కదా. అప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’’ అని వ్యాఖ్యానించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా ఈ సీజన్‌లో వార్నర్‌ అంతగా ఆకట్టుకోలేదన్న సంగతి తెలిసిందే.  అంతేగాక జట్టు కూడా వరుస పరాజయాలతో చతికిల పడింది. దీంతో తొలి దశలో కెప్టెన్సీ నుంచి యాజమాన్యం అతడిని తప్పించింది.

అంతేగాక ఫేజ్‌ 1లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో అతడికి చోటు కూడా దక్కలేదు. అయినా వార్నర్‌ ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా.. సహచర ఆటగాళ్లకు డ్రింక్స్‌ మోస్తూ.. క్రీడాస్ఫూర్తిని చాటాడు. ఇక.. సోమవారం నాటి మ్యాచ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మరలా.. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ను పక్కనపెట్టారు. కనీసం మైదానంలో కూడా అతడు కనిపించలేదు. 

ఈ క్రమంలో హోటల్‌ గదికే పరిమితమైన వార్నర్‌.. తన స్థానంలో జట్టులోకి వచ్చిన జేసన్‌ రాయ్‌, టీమ్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించాడు. ఈ నేపథ్యంలో.. ‘‘వార్నర్‌ స్టేడియంలో ఉన్నాడా.. మాకు కనిపించడం లేదే’’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇందుకు స్పందించిన వార్నర్‌.. ‘‘దురదృష్టవశాత్తూ మళ్లీ కనిపించకపోవచ్చు.. అయినా సపోర్టు చేస్తూనే ఉండండి’’ అని బదులిచ్చాడు. ఈ క్రమంలో వార్నర్‌ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

‘‘అన్నా అలా అనొద్దు.. టీమ్‌కు తొలి టైటిల్‌ సాధించి పెట్టావు.. నువ్వు ఇక్కడే ఉండాలన్న.. ఫాంలోకి వచ్చి మళ్లీ సత్తా చాటాలి. ఏదేమైనా నువ్వు హైదారాబాద్‌తోనే ఉండాలి’’ అని ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. ఒక్క సీజన్‌లో రాణించనంత మాత్రాన చాంపియన్‌ను పక్కన పెడతారా అని ఫ్రాంఛైజీ తీరును తప్పుబడుతున్నారు. ప్రస్తుతం వార్నర్‌ పట్ల సన్‌రైజర్స్‌ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. కాగా 2016లో వార్నర్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ తమ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: Inzamam ul Haq: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement