సన్‌రైజర్స్ హైదరాబాద్:
కెప్టెన్: డేవిడ్ వార్నర్
విజేత: 2016, 2009(డెక్కన్ చార్జర్స్)
ఐపీఎల్ జట్టలో అన్నింటికల్లా అత్యంత పొదుపైన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. డెక్కన్ చార్జర్స్ నుంచి సన్‌రైజర్స్‌గా పేరు మార్చకున్న తర్వాత 2016లో టైటిల్ విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఎస్‌ఆర్‌హెచ్ ప్రతీ సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్‌కు చేరుకున్న జట్టుగా నిలిచింది. 2018 ఐపీఎల్ సీజన్‌లో కేన్ విలియమ్స్‌న్ కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ సీఎస్‌కే చేతిలో ఓడి రన్నరఫ్‌గా నిలిచింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ బలమంతా కెప్టెన్ డేవిడ్ వార్నర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చదవండి: రాజస్తాన్ రాయల్స్ షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
వార్నర్ తర్వాత బెయిర్ స్టో, విలియమ్సన్, మనీష్ పాండే మినహా చెప్పుకోదగ్గ ఆటగాడు ఎవరు లేరు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, నటరాజన్, రషీద్ ఖాన్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఇక గత సీజన్‌లో వార్నర్ సారథ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఎన్నో కష్టాలు దాటుకుంటూ ప్లే ఆఫ్‌కు చేరుకున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి ఇంటి బాట పట్టింది. ఈసారి వేలంలో కేదార్ జాదవ్ మినహా పెద్దగా చెప్పుకోదగ్గ ఆటగాళ్లను ఎవరిని కొనుగోలు చేయలేదు. ఎస్‌ఆర్‌హెచ్ తాను ఆడనున్న 14 లీగ్ మ్యాచ్‌ల్లో.. 5 మ్యాచ్‌లు చెన్నై.. 4మ్యాచ్‌లు ఢిల్లీ.. 3 మ్యాచ్‌లు కోల్‌కతా.. 2 మ్యాచ్‌లు బెంగళూరు వేదికగా ఆడనుంది.
చదవండి: కేకేఆర్ షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
ఎస్‌ఆర్‌హెచ్ జట్టు:
బ్యాట్స్ మెన్: డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, కేదార్ జాదవ్, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), శ్రీవాత్సవ గోస్వామి(వికెట్ కీపర్), వృద్దిమాన్ సాహా(వికెట్ కీపర్), జేసన్ రాయ్
ఆల్‌రౌండర్లు: మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్
బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టి.నటరాజన్, బాసిల్ తంపి, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, ముజీబ్ జాద్రాన్, జె.సుచిత్
సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) మ్యాచ్‌లు
తేది | జట్లు | వేదిక | సమయం |
ఏప్రిల్ 11 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్ | చెన్నై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 14 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ | చెన్నై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 17 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ | చెన్నై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 21 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ | చెన్నై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 25 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | చెన్నై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 28 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్‌కే | ఢిల్లీ | రాత్రి 7.30 గంటలు |
మే 2 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ | ఢిల్లీ | సాయంత్రం 3.30 గంటలు |
మే 4 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ | ఢిల్లీ | ఢిల్లీ.. రాత్రి 7.30 గంటలు |
మే 7 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్‌కే | ఢిల్లీ | ఢిల్లీ.. రాత్రి 7.30 గంటలు |
మే 9 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ | కోల్‌కతా | ఢిల్లీ.. రాత్రి 7.30 గంటలు |
మే 13 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ | కోల్‌కతా | ఢిల్లీ.. రాత్రి 7.30 గంటలు |
మే 17 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | కోల్‌కతా | ఢిల్లీ.. రాత్రి 7.30 గంటలు |
మే 19 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ | బెంగళూరు | ఢిల్లీ.. రాత్రి 7.30 గంటలు |
మే 21 | ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్ | బెంగళూరు | సాయంత్రం 3.30 గంటలు |
Comments
Please login to add a commentAdd a comment