
Photo Courtesy: IPL
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 9) మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ప్రస్తుత సీజన్‌లో విజయం కోసం ముఖం వాచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలు కాగా.. గత సీజన్ పేలవ ప్రదర్శన కొనసాగింపుగా ఎస్‌ఆర్‌హెచ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయంపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది సీజన్ తొలి విజయాన్ని నమోదు చేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా పాయింట్ల ఖాతా తెరవనుంది. గత రికార్డులను పరిశీలిస్తే.. క్యాష్ రిచ్ లీగ్‌లో సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెన్నై 12 మ్యాచ్‌ల్లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. ఇరు జట్లు చివరిగా తలపడిన 5 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే 3, ఎస్‌ఆర్‌హెచ్ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.
చదవండి: కీలక పోరుకు సిద్దమైన సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్.. తొలి విజయం ఎవరిది!
Comments
Please login to add a commentAdd a comment