photo credit: IPL Twitter
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను భారీ షాక్ తగిలింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్లు బంతిని మార్చడాన్ని బహిరంగంగా విమర్శించినందుకు (పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో) గాను అశ్విన్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది.
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద అశ్విన్‌కు ఈ జరిమానా విధించినట్లు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ తెలిపారు. కాగా, ఇదే మ్యాచ్‌కు సంబంధించి రాజస్థాన్‌కు మరో షాక్ కూడా తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు కూడా రిఫరీ జరిమానా (12 లక్షలు) విధించారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment