
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. పంజాబ్ మూడింట ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది.
హెడ్ టు హెడ్ రికార్డులు..
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరుగగా గుజరాత్ 2, పంజాబ్ ఒక మ్యాచ్‌లో గెలిచాయి. చివరిసారిగా (2023, మొహాలీ) ఇరు జట్లు తలపడిన మ్యాచ్‌లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బలాబలాలు..
ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. పంజాబ్ కింగ్స్ ప్రదర్శన పేపర్‌పై కనిపించినంత పటిష్టంగా ఆన్ ద ఫీల్డ్ ఉండటం లేదు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్ మినహాయించి ఈ జట్టు ఆటగాళ్లు మూకుమ్మడిగా రాణించింది లేదు. శిఖర్ ధవన్, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్, జితేశ్ శర్మ, సామ్ కర్రన్, లివింగ్‌స్టోన్ లాంటి ఆటగాళ్లతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నప్పటికీ వీరంతా కలిసికట్టుగా రాణించలేకపోతున్నారు.
బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ఈ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఆన్ ఫీల్డ్ వచ్చే సరికి తేలిపోతుంది. రబాడ, సామ్ కర్రన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ లాంటి ఇండియన్ స్టార్స్ ఉన్నప్పటికీ.. పంజాబ్ బౌలింగ్‌ను ప్రత్యర్దులు అవలీలగా ఎదుర్కొంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే.. పంజాబ్ చూడటానికి బలంగా కనిపిస్తున్నా సత్ఫలితాలు మాత్రం రాబట్టలేకపోతుంది.
గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు అన్ని విభాగాల్లో సాధారణ జట్టులా కనిపిస్తున్నా ఆటగాళ్లంతా కలిసికట్టుగా రాణిస్తుండటంతో సత్ఫలితాలు సాధించగలుగుతుంది. గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌లో శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్ తప్పిస్తే మిగతా వాళ్లంతా ఓ మోస్తరు బ్యాటర్లే. అయినప్పటికీ ఈ జట్టు మూడింట రెండు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, తెవాటియా చెప్పుకోదగ్గ స్టార్లు కానప్పటికీ వీరిని మ్యాచ్ విన్నర్లుగా పరిగణించవచ్చు.
బౌలింగ్ విషయానికొస్తే.. ఈ జట్టు బౌలింగ్ లైనప్ పేపర్ పులి పంజాబ్ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, జాషువ లిటిల్ లాంటి విదేశీ బౌలర్లు.. ఉమేశ్ యాదవ్, మోహిత శర్మ లాంటి దేశీ పేసర్లతో గుజరాత్ బౌలింగ్ విభాగం కళకళలాడుతుంది. ఇన్ని వనరుల నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో గుజరాత్‌కే విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పైగా గుజరాత్‌కు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పైచేయి ఎవరిదో వేచి చూడాలి.
తుది జట్లు (అంచనా)..
గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే
పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment