
ఐపీఎల్ 2024 ఎడిషన్ తొలి షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 22) విడుదల చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి విడతగా 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈ లెగ్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇంతవరకు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
చెపాక్ స్టేడియంలో సీఎస్‌కేపై ఆర్సీబీకి చెత్త రికార్డు ఉంది. ఈ వేదికపై ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2008) ఆర్సీబీ.. సీఎస్‌కేను ఓడించింది. అప్పటినుంచి జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో (2010, 2011 (రెండు సార్లు), 2012, 2013, 2015, 2019) ఆర్సీబీ ఒక్కసారి కూడా సీఎస్‌కేను ఓడించలేకపోయింది. ఈ రికార్డే ఆర్సీబీ అభిమానులను సీజన్ ప్రారంభానికి ముందు కలవరపెడుతుంది. జట్ల బలాబలాల ప్రకారం చూసినా.. ప్రస్తుత సీఎస్‌కే జట్టును నిలువరించే సత్తా ఆర్సీబీ లేదు.
చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, అజయ్ మండల్, నిశాంత్ సింధు, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, సిమ్రన్‌జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవినాష్ రావు ఆరవెల్లి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, దినేష్ కార్తీక్, వైషాక్ విజయ్‌కుమార్, మనోజ్ భాండగే, రజత్ పాటిదార్, అనూజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయి, ఆకాష్ దీప్, రాజన్ కుమార్, హిమాన్షు శర్మ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, అల్జరీ జోసెఫ్, యశ్ దయాళ్, టామ్ కర్రన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్, మయాంక్ డాగర్