ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు ఖారారు అయ్యాయి. 28(శనివారం) బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఫ్రాంఛైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది.
ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. ఇక అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది.
ఆర్‌టీఎం కార్డును ఈ సీజన్‌తో తిరిగి తెవాలని నిర్ణయించుకున్నారు. కాగా కొత్త రూల్స్ ప్రకారం.. అంటిపెట్టుకునే ఆరుగురు ఆటగాళ్లలో ఒకరు కచ్చితంగా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ఉండాలి. అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు ఇద్దరైనా పర్వాలేదు.
రిటెన్షన్ ఆటగాళ్లకు ఎంతంటే?
అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రిటెన్షన్‌లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి.
అదేవిధంగా నాలుగు, ఐదో ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవడానికి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లపై 75 కోట్లు వెచ్చించినట్లు అవుతోంది. అంటే ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉంటాయి. ఆ మొత్తాన్ని మెగా వేలంలో ఫ్రాంచైజీలు ఉపయోగించుకోవచ్చు.
ఆటగాళ్లపై కాసుల వర్షం
ఇకపై ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లపై కాసుల వర్షం కురవనుంది. ఐపీఎల్-2025 నుంచి క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును రూ.7.50 లక్షలు అందజేయాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. గతంలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు రూ. 3 నుంచి కోట్లు 4 కోట్లు ఉండేది. అదేవిధంగా గతేడాది తీసుకువచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కూడా 2027 సీజన్ వరకు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment